News August 6, 2024

అన్నమయ్య: నాటు తుపాకీతో కాల్చుకుని వ్యక్తి మృతి

image

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేనివాండ్ల పల్లె వద్ద నాటు తుపాకీ కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోనమలకు చెందిన రాజగోపాల్ నాటు తుపాకీతో కాల్చుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజగోపాల్ మృతి చెందాడు. ఇతను ఇటుకల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న రాజగోపాల్ మృతికి అప్పులే కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలోని నాటు తుపాకీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

Similar News

News December 17, 2025

ఖాజీపేట: కానిస్టేబుల్‌ జాబ్ కొట్టిన హోమ్ గార్డు కుమారుడు

image

ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తున్న ప్రసాద్ కుమారుడు పవన్ కళ్యాణ్ పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ వంశీధర్ పవన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ యూనిఫామ్ అందజేశారు. విధి నిర్వహణలో ప్రజలకు మంచి సేవలు అందించి ఉన్నతంగా రాణించాలని సూచించారు.

News December 17, 2025

కడప: శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్ అందజేత

image

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మన కడప జిల్లా మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత చెక్కును మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉండవల్లిలో బుధవారం ఆమె అందుకున్నారు. కడపలో ఇంటి స్థలం, గ్రేడ్ వన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఆమెకు ఇవ్వనున్న విషయం తెలిసిందే.

News December 17, 2025

కడప జిల్లాలో ‘ఫేస్ వాష్ అండ్ గో’

image

కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రాత్రి వేళ పలుచోట్ల వాహనాలను నిలిపారు. లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లకు నీరు అందించి ఫేస్ వాష్ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.