News March 1, 2025
అన్నమయ్య: ‘నాటు సారా నిర్మూలనకు కృషి చేయాలి’

అన్నమయ్య జిల్లా చినమడియం మండలంలోని గిరిజన ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ పేర్కొన్నారు. శుక్రవారం ముసలికుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని బండక్రింద తాండాలో నాటుసారా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ మాట్లడుతూ.. ప్రభుత్వం గిరిజనులకు ఉపాధి కల్పించి, అన్నివిధాల ఆదుకుంటుదని హామీ ఇచ్చారు.
Similar News
News December 19, 2025
నేటి సామెత: ఉత్తగొడ్డుకు అరుపులు మెండు

ఈ సామెతలో ఉత్తగొడ్డు అంటే పాలివ్వని, పాలు లేని ఆవు (గొడ్డు ఆవు) అని అర్థం. పాలు ఇచ్చే ఆవు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది, కానీ పాలు లేని గొడ్డు ఆవు తరచుగా అరుస్తుంటుంది. అలాగే నిజమైన సామర్థ్యం గల వ్యక్తులు తమ పని తాము చేసుకుపోతారని.. పనికిరాని, పనితీరు సరిగాలేని అసమర్థులే ఎక్కువగా మాట్లాడుతూ తమ గొప్పలు చెప్పుకుంటారని ఈ సామెత తెలియజేస్తుంది.
News December 19, 2025
మోడల్ స్కూళ్లలో 5వ తరగతికి ఎంట్రన్స్ పరీక్ష!

TG: మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్షలుండగా, వాటిని 5వ క్లాస్ నుంచే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. గురుకులాల్లో 5వ క్లాస్ నుంచే క్లాసులు నడుస్తుండటంతో మోడల్ స్కూళ్లలోనూ ఆ విధానాన్నే అమలు చేయనున్నారు. ఈ మేరకు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఆలస్యమైతే ఎప్పటిలాగే 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది.
News December 19, 2025
నంద్యాల జిల్లాకు చెందిన IAS అధికారికి కీలక బాధ్యతలు

అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్గా నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడుకు చెందిన సీనియర్ IAS అధికారి గంధం చంద్రుడును నియమించింది. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు.


