News March 16, 2025
అన్నమయ్య: పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

మార్చి 17నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సీ, ఓపెన్ స్కూల్ పరీక్షల సందర్భంగా జిల్లాలో పకడ్బంది ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యాశాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
Similar News
News December 9, 2025
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)వరంగల్‌లో 3పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, B.Sc( Food Tech), MSc( Food Tech), BA/BSc(సైకాలజీ)లేదా MA/MSc(సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PWBDలకు రూ.300. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitw.ac.in/
News December 9, 2025
సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. 1983 ఏప్రిల్‌లో ఇండియన్ సిటిజన్‌షిప్ రావడానికి మూడేళ్ల ముందే ఎలక్టోరల్ రోల్లో పేరు నమోదైనట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2026, జనవరి 6వ తేదీన ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోనె తెలిపారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
News December 9, 2025
సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మెప్మా మహిళలు, ఆశా వర్కర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం అందరూ సమూహంగా “జయ జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.


