News January 30, 2025

అన్నమయ్య: ‘పింఛన్ల పంపిణీ వందశాతం పూర్తి చేయాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న అన్నమయ్య జిల్లాలో 100% సామాజిక పింఛన్ల పంపిణీని సజావుగా పూర్తి చేయాలని, జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నందలి మినీ హాలు నుంచి అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఫిబ్రవరి 1న 100% పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 21, 2025

ఏలూరు: GOOD NEWS.. ఉచిత శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా మెయిన్స్, సివిల్స్ కోర్సుల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ అధికారిణి నాగరాణి తెలిపారు. దీనిలో భాగంగా, అర్హుల ఎంపికకు డిసెంబర్ 5న రాజమండ్రిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఎంపికైన వారికి డిసెంబర్ 10 నుండి విజయవాడ బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. మరింత సమాచారం కోసం 9030211920 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News November 21, 2025

మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలు

image

నల్లగొండ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి కూరగాయల ధరలు సామాన్యుడికి అందకుండా పైపైకి ఎగబాకుతున్నాయి.టమాటా కిలో 50 రూపాయలు,చిక్కుడుకాయ కిలో 140, గోకర, బెండకాయ,బీరకాయ కిలో 120, దోసకాయ కిలో 60, వంకాయ కిలో 80, క్యారెట్ కిలో120 రూపాయలకు అమ్ముతున్నారు.దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇటీవల తుఫాను ప్రభావంతోనే కూరగాయల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

News November 21, 2025

కోనసీమలో 26న పవన్ కళ్యాణ్ పర్యటన

image

ఈనెల 26న రాజోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సమీక్షించారు. 26వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో కేసనపల్లి చేరుకుంటారన్నారు.