News May 20, 2024
అన్నమయ్య: బంగారాన్ని మెరుగు పట్టిస్తానని మోసం చేశారు

గాలివీడు మండల పరిధిలోని ఎర్రయ్యగారిపల్లిలో బిహార్‌కు చెందిన సంకట్ కుమార్, సుభాష్ కుమార్లపై చీటింగ్ కేసునమోదు చేసినట్లు ఎస్సై వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని నీల నాగమునెమ్మ అనే మహిళ బంగారాన్ని మెరుగు పట్టించి ఇస్తామని చెప్పి 33 గ్రాముల బంగారు తీసుకొని 20 గ్రాములకు తగ్గించి మోసం చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
Similar News
News November 23, 2025
కడప: గ్రామ స్థాయికి వెళ్లని స్వచ్ఛాంధ్ర ప్రచారం?

ప్రతి నెలా 3వ శనివారం అధికారులు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అంటూ ప్రచారం చేసినా, గ్రామస్థాయిలో అమలు కావడం లేదని స్పష్టమవుతోంది. ఆదివారం కమలాపురం మండలం <<18369261>>ఎర్రగుడిపాడులోని<<>> ఓ కాలనీ ప్రజలు విరేచనాలు, వాంతులతో మంచాన పడ్డారు. దీనికి కారణం అక్కడి వారికి పారిశుద్ధ్యంపైన అవగాహన లేకపోవడమేనని పలువురు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అధికారులు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లట్లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.
News November 23, 2025
సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కడప జట్టు

69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-14 పోటీల్లో కడప జిల్లా బాలురు, బాలికల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బాలురు గోదావరి జట్టును, బాలికలు కృష్ణా జట్టును ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాయి. అలాగే ప్రకాశం, అనంతపురం, ఈస్ట్ గోదావరి, విజయనగరం బాలికల జట్లు కూడా సెమీఫైనల్‌కు చేరాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. రేపు ఉదయం సెమీఫైనల్స్ జరగనున్నాయి.
News November 23, 2025
మైదుకూరు: గౌడౌన్లలో నిల్వ ఉన్న 6858.45 కేజీల స్టీల్‌పై అనుమానాలు

మైదుకూరు హౌసింగ్ శాఖకు సంబంధించిన స్టీలు నిల్వల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలలో 6858.45 కేజీల స్టీలు పంపిణీలో అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారులకు నివేదికలు వెళ్లాయి. అయితే విచారణకు అధికారులు వచ్చే లోపు స్టీలు అందుబాటులో ఉంచారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశంపై తిరిగి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉన్న స్టీలు గతంలో సరఫరా చేసిందా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.


