News April 22, 2025
అన్నమయ్య: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

అన్నమయ్య జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?
Similar News
News December 16, 2025
నేడు విజయవాడలో జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 12PMకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జోజినగర్ వెళ్లి బాధితులతో మాట్లాడనున్నట్లు చెప్పింది. వారంతా ఇప్పటికే జగన్ను కలిసి తమ ఇళ్లను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించారంది. ఈ క్రమంలో ఆయన నేరుగా ఘటనా స్థలికి వెళ్లి బాధితులను కలవనున్నారని పేర్కొంది.
News December 16, 2025
మంగళవారం ఈ పనులు చేయకూడదట..

హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఈ రోజు కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కటింగ్, షేవింగ్, గోర్లు కత్తిరించడం వంటివి చేయరాదు. చేస్తే ఆయుష్షు తగ్గుతుంది. అలాగే, అంగారక ప్రభావం వల్ల కొత్త బట్టలు కొనడం, ధరించడం, కొత్త బూట్లు వేసుకోవడం మంచిది కాదు. మసాజ్ చేయించుకోవడం కూడా ఆరోగ్య సమస్యలకు, ఇంట్లో తగాదాలకు దారితీయవచ్చు’ అంటున్నారు.
News December 16, 2025
త్రివిక్రమ్.. కెరీర్లో తొలిసారి!

త్రివిక్రమ్ తన జోనర్ మార్చినట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సరదా సినిమాలతో సందడి చేసే ఆయన కెరీర్లో తొలిసారి థ్రిల్లర్ కథను ఎంచుకున్నారని చెబుతున్నాయి. వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ అనే మూవీ పట్టాలెక్కగా ఇటీవల పోస్టర్ సైతం విడుదలైంది. ఈ చిత్రం క్యాప్షన్ AK47 ఫాంట్ స్టైల్ రక్తపు మరకలతో ఉండటం చూస్తే థ్రిల్లర్ మూవీగా స్పష్టమవుతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


