News March 29, 2025
అన్నమయ్య: బాలుడిపై అఘాయిత్యం.. వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9ఏళ్ల బాలుడు ఈనెల 27సాయంత్రం ఇంటి వద్ద సైకిల్ తొక్కుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేశ్ బాలుడికి మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Similar News
News April 6, 2025
భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
News April 6, 2025
మా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు: SRH కోచ్

ఆడిన ప్రతి మ్యాచ్లోనూ సన్రైజర్స్ 300 కొడుతుందన్న అంచనాలు ఉంటున్నాయి. అవే ఆ జట్టు కొంపముంచాయా? SRH అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మట్ ఆ విషయంపై స్పందించారు. ‘అంచనాల ఒత్తిడి మాపై ఏమాత్రం లేదు. ఇదంతా జట్టుకు బయట జరుగుతున్న విషయం మాత్రమే. అంతర్గతంగా జట్టుపై అది ఎలాంటి ప్రభావమూ చూపించదు’ అని పేర్కొన్నారు. 300 పరుగులు అటుంచి ఈ సీజన్లో మ్యాచులు గెలిచేందుకు కూడా సన్రైజర్స్ ఇబ్బంది పడుతుండటం గమనార్హం.
News April 6, 2025
నారాయణపేట: ఆరుగురిపై కేసు నమోదు

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల శివారులో కొంత మంది జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్, ఉట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.7,700 నగదు, 6 సెల్ఫోన్లు, 3 బైక్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించామని ఎస్ఐ కృష్ణంరాజు శనివారం తెలిపారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.