News March 29, 2025

అన్నమయ్య: బాలుడిపై ఆఘాయిత్యం

image

అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9ఏళ్ల బాలుడు ఈనెల 27 సాయంత్రం ఇంటి వద్ద సైకిల్ తొక్కుతున్నాడు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాలుడికి మాయమాటలు చెప్పాడు. బలవంతంగా తన ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News October 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 16, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 16, 2025

పాలమూరు: GREAT.. తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు!

image

మహబూబ్‌‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాపూర్ వాసి వేముల శ్రీనివాసులు(42) హైదరాబాద్‌లో మేస్త్రీ పని చేస్తూ ఈనెల 10వ తేదీన మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అతడి అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో కాలేయం, గుండె, కిడ్నీలు, కార్నియాస్‌ను ఆరుగురికి దానం చేశారు.

News October 16, 2025

KNR: జిల్లా కలెక్టర్‌తో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

image

ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ పమెలా సత్పతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వానాకాలంలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నామని తెలిపారు. 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.