News March 19, 2025

అన్నమయ్య: భార్య గర్భిణి.. ప్రేయసితో భర్త జంప్

image

భార్యను మోసం చేసి భర్త మరో యువతితో వెళ్లిపోయిన ఉదంతంపై మంగళవారం రాత్రి బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కొత్తకోటకు చెందిన డ్రైవర్ అనిల్ ములకలచెరువు మండలానికి చెందిన 21ఏళ్ల యువతితో గతేడాది ఆగస్టులో వివాహమైంది. ప్రస్తుతం 6నెలల గర్భిణి. అయితే స్థానికంగా ఉండే యువతి మాయలో పడి గర్భంతో ఉన్న భార్యను వదిలేసి ప్రియురాలితో జంప్ అయ్యాడు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు అయింది.

Similar News

News March 19, 2025

సైదాపూర్: పుట్టెడు దుఃఖంలో ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థి

image

సైదాపూర్ మండలం ఆరెపల్లి గ్రామనికి చెందిన బూర్గుల అభిరామ్ పుట్టెడు దు:ఖంలోనూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాశాడు. అభిరామ్ తండ్రి రాజేశ్వర్‌రావు మృతిచెందగా తండ్రి మృతదేహం ఇంటిదగ్గర ఉండగానే పరీక్ష రాసొచ్చి అనంతరం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి చితికి అభిరామ్ నిప్పంటించాడు. విద్యార్థిని బంధువులు, గ్రామస్థులు ఆవేదన చెందారు.

News March 19, 2025

కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

image

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్‌ విధించారు.

News March 19, 2025

6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్: కిషన్ రెడ్డి

image

TG: 15 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలును విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. 6 గ్యారంటీలపై ప్రజలు ఆశలు వదులుకొనేలా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. అంకెల గారడీతో ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. పదేళ్ల పాటు BRS రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టేస్తే, కాంగ్రెస్ తీరు పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందని ధ్వజమెత్తారు.

error: Content is protected !!