News March 21, 2025
అన్నమయ్య: మహిళను రేప్ చేసిన వ్యక్తిపై కేసు.!

మహిళను నమ్మించి నయవంచనకు గురి చేయడమే కాకుండా, అత్యాచారానికి పాల్పడి ఆపై అబార్షన్ చేయించిన వ్యక్తిపై మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ ఎరిసావలి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె బెంగళూరు రోడ్డులోని ఓ ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేశ్ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్‌పై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 1, 2026
నాగిరెడ్డిపేటలో సినిమా షూటింగ్

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గువ్వల చెరువు ఘాట్ అనే సినిమా షూటింగ్ నిర్వహించారు. సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని షూటింగ్‌ను తిలకించారు. సినిమా నిర్వాహక మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 8 వరకు ఇక్కడ షూటింగ్ ఉంటుందన్నారు.
News March 1, 2026
మార్చి 3న సింహాచలంలో దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ వెంకట్రావు శనివారం తెలిపారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు భక్తులకు మరుసటి రోజు అనుమతిస్తామన్నారు. దర్శనాలతో పాటు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News March 1, 2026
పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.


