News January 24, 2025
అన్నమయ్య: ముగ్గురికి జైలుశిక్ష

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముగ్గురికి జైలుశిక్ష పడింది. అన్నమయ్య జిల్లా కేవీపల్లె(M) నూతనకాలువకు చెందిన సంగటి చిన్నయ్య, సహదేవ, వీరభద్ర 2020లో ఎర్రచందనం తరలించారు. అప్పటి ఎస్ఐ సుమన్ వీరిని అరెస్ట్ చేశారు. నేరం నిరూపణ కావడంతో ముగ్గురికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు అన్నమయ్య పోలీసులు తెలిపారు.
Similar News
News November 18, 2025
ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 8

45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? (జ.వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? (జ.తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? (జ.ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (జ.చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవ్వడు? (జ.ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు) <<-se>>#YakshaPrashnalu<<>>