News February 15, 2025
అన్నమయ్య: మొబైల్ పోగొట్టుకున్న వారికి శుభవార్త

అన్నమయ్య జిల్లాలో ఎవరైనా తమ మొబైల్ ఫోన్ దొంగలించబడినా, పోగొట్టుకున్నా 8688830012 నంబర్‌కు whatsapp ద్వారా ‘హాయ్’ అని మెసేజ్ చేయవచ్చని అన్నమయ్య పోలీసులు సూచిస్తున్నారు. తర్వాత మీకు ఒక వెబ్ లింక్ వస్తుంది. ఆ లింకుపై టచ్ చేసి అందులో వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేయాలన్నారు. చివరగా, మొబైల్ ట్రేసింగ్ సైబర్ క్రైమ్ టీం సభ్యులు సెల్ ఫోన్‌ను వెతికి అప్పగిస్తారని వారు తెలిపారు. SHARE IT.
Similar News
News September 17, 2025
HYDలో జాతీయ జెండా ఆవిష్కరించిన కవిత

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎంకే. మొయినుద్దీన్‌ని శాలువా పూలమాలలతో సత్కరించారు.
News September 17, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

TG: గ్రూప్-1 మెయిన్స్ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం

ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.