News April 2, 2025
అన్నమయ్య యువతికి ఆల్ ఇండియా ర్యాంక్

CA ఫైనల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా యువతి సత్తా చాటింది. తంబళ్లపల్లె(M) కన్నెమడుగుకు చెందిన తేజశ్విని ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెను MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి అభినందించారు. YCP నాయకులతో కలసి తేజశ్వినిని శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తంబళ్లపల్లె పేరును అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
Similar News
News December 23, 2025
రేపు నల్గొండలో ట్రై సైకిళ్ల పంపిణీ

జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం మరో ముందడుగు వేసింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవతో ఈసీఐఎల్ సీఎస్‌ఆర్ నిధుల కింద సుమారు రూ.70 లక్షల వ్యయంతో 105 మంది బాధితులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు స్థానిక మహిళా ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు ఈసీఐఎల్ ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు.
News December 23, 2025
సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలి: ఎస్పీ

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News December 23, 2025
ఏఐ ‘దాహం’.. బిలియన్ల లీటర్ల నీరు స్వాహా!

మనం ఒక AI చాట్‌బాట్‌ను చిన్న ప్రశ్న అడిగినా.. వెనుక సర్వర్లు వేడెక్కిపోతాయన్న విషయం మీకు తెలుసా? వాటిని చల్లబరచడానికి బిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2025లో AI వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 765 బిలియన్ లీటర్ల నీరు వాడినట్లు అంచనా. ఇది గ్లోబల్ బాటిల్ వాటర్ ఇండస్ట్రీ మొత్తం వినియోగించే నీటితో సమానం. మనం వాడే సాంకేతికత వెనుక ఇంతటి ‘నీటి దాహం’ దాగి ఉందన్నమాట.


