News February 21, 2025
అన్నమయ్య: రికార్డుల్లో ఆ ఊరే లేదు..!

రికార్డుల్లో పేరే లేని ఊరుంటుందని మీకు తెలుసా? అవును ఇది నిజమే. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం రెవెన్యూ రికార్డుల్లో లేదు. దీంతో గుర్తింపు కార్డుల కోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మ్యుటేషన్ చేద్దామనుకున్నా ఆన్లైన్లో చిట్టిబోయనపల్లె వివరాలు కనిపించడం లేదు. రెవెన్యూ గ్రామానికి చెందిన వందలాది ఎకరాల భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 2, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.280 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 2, 2025
మహబూబాబాద్: 344 సర్పంచ్, 857 వార్డు స్థానాలకు నామినేషన్లు

జిల్లాలో రెండో విడత ఎన్నికలకు సోమవారం సర్పంచ్‌కు 344, వార్డు స్థానాలకు 857 నామినేషన్లు దాఖలయ్యాయి. బయ్యారం, చిన్నగూడూర్, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూర్ మండలాల్లోని 158 గ్రామ పంచాయతీలు, 1360 వార్డులకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు వివరించారు.
News December 2, 2025
వరంగల్: 19 పంచాయతీలు ఏకగ్రీవం!

ఉమ్మడి జిల్లాలో 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయి. జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. జనగామలో రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, తరిగొప్పుల మండలాల్లో ఆరు పంచాయతీలు, వర్ధన్నపేట, రాయపర్తిలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. భూపాలపల్లిలో చెంచుపల్లి, మహబూబాబాద్‌లో మూడు పంచాయతీలు ఒక్కో నామినేషన్‌తో ఏకగ్రీవం కావడం ప్రత్యేకత.


