News December 17, 2024

అన్నమయ్య: రూ.3.5 కోట్ల ఎర్రచందనం సీజ్

image

గుజరాత్‌లోని ఎర్రచందనం గోడౌన్‌పై తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి ముగ్గురు అంతర్రాష్ట్ర ప్రధాన స్మగ్లర్లను మంగళవారం అరెస్ట్ చేశారు. సుమారు రూ.3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా.. వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం తెలిసిందని వారు తెలిపారు.

Similar News

News October 24, 2025

చిత్తూరు జిల్లాలో 177 ఎకరాలలో దెబ్బతిన్న వరి పంట

image

వర్షాల కారణంగా జిల్లాలో 177 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. 12 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో 172 మంది రైతులు సాగు చేసిన వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 70 ఎకరాల్లో పైరు దెబ్బతినగా, చౌడేపల్లె మండలంలోని ఒకే గ్రామంలో 40 ఎకరాలు, యాదమరి మండలంలోని ఐదు గ్రామాల్లో 12.25 ఎకరాలు సాగు చేసిన వరి పైరు దెబ్బతింది.

News October 24, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో బంగారుపాళ్యం మినహా 31 మండలాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిండ్రలో 83.4 మిమీ, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది. మండలాల వారీగా కుప్పంలో 35.2, విజయపురంలో 34.4, నగరిలో 28.8, శ్రీరంగరాజపురంలో 26.8, పాలసముద్రంలో 26.6, గుడుపల్లెలో 23.6, సోమలలో 14.6 మీ. మీ వర్షపాతం నమోదు అయింది.

News October 23, 2025

చిత్తూరులో భద్రత కట్టుదిట్టం.!

image

చిత్తూరు మాజీ మేయర్ కటారి <<18085908>>అనురాధ దంపతుల<<>> హత్య కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. CHUDA చైర్‌పర్సన్ కె.హేమలత, మాజీ MLA సి.కె.బాబు నివాసాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా న్యాయమూర్తి, APP, డిఫాక్టో కంప్లైనెంట్ నివాసాల వద్ద సైతం భద్రత పెంచారు. నేరపూర్వ చరిత్ర ఉన్న వారిపై నిఘా కొనసాగుతోందని DSP సాయినాథ్ తెలిపారు.