News February 6, 2025

అన్నమయ్య: రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదు

image

ఇటీవల వర్షాల కారణంగా సెలవులు ఇవ్వడం వల్ల పాఠశాల పని దినాలు 220 రోజులు కన్నా తక్కువ ఉన్నందున ఈనెల 8వ తేదీన రెండో శనివారం కూడా పాఠశాలలు పని దినంగా నిర్ణయించినట్లు డీఈవో బాలసుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి అన్నమయ్య జిల్లాలో రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని డీఈవో సూచించారు.

Similar News

News December 23, 2025

మేడారానికి మంత్రి కొండా దూరం!

image

మేడారంలో ముగ్గురు మంత్రులు మంగళవారం పర్యటించనున్నారు. దేవాదాయ శాఖ కిందకు వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకు మంత్రి కొండా సురేఖ హాజరు కావడం లేదు. వరంగల్ నగరంలో పర్యటన ఉన్నా, మేడారానికి రావడం లేదని తెలుస్తోంది. మంత్రుల శాఖల మధ్య విభేదాలు ఇంకా సమసిపోనట్టు సమాచారం. మంత్రికి అనుకూలంగా పని చేసిన ముగ్గురు పోలీసులపై వేటు వేయడంపై గ్యాప్ మరింత పెరిగినట్టు తెలుస్తోంది.

News December 23, 2025

రావికమతం: చీరకు నిప్పంటుకున్న మహిళ మృతి

image

రావికమతం మండలం మేడివాడ పంచాయతీ శివారు అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన పాచిల చిలకమ్మా (60) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. సోమవారం సాయంత్రం చలి మంట కోసం ఆమె నిప్పు పెడుతుండగా చీరకు అంటుకుని శరీరం సగానికి పైగా కాలిపోయింది. పరిస్థితి విషమించడంతో అనకాపల్లి ఆస్పత్రి నుంచి సోమవారం రాత్రి విశాఖ KGH‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని ఆమె మనవడు అర్జున్ తెలిపారు.

News December 23, 2025

కరీంనగర్: ఉచిత శిక్షణ.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

IELTSలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువు JAN 11 వరకు పొడగించామని జిల్లా BC అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్నత విద్య చదివేందుకు స్కాలర్ షిప్లు పొందటానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తైన విద్యార్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.