News March 7, 2025

అన్నమయ్య: ‘రేపు పాఠశాలలకు సెలవు లేదు’

image

మార్చి నెల రెండవ శనివారం అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలకు సెలవు లేదని అన్ని యాజమాన్య పాఠశాలలు విధిగా తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కే.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంవత్సరంలో 220 పని దినములు తగ్గకుండా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డీఈఓ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో అధిక సెలవులు ఇవ్వడం వల్ల వర్కింగ్ డేస్ సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

గుండెపోటుతో టీచర్ మృతి

image

అవుకులో ప్రభుత్వ ఉపాద్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. అవుకుకు చెందిన విజయ్ గత డీఎస్సీలో ఉద్యోగం సాధించి పాణ్యం గురుకుల పాఠశాలలో నెలక్రితం ఉద్యోగంలో చేరారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. విజయ్ మృతితో కుటుంబంతో పాటు అవుకులో విషాదం నెలకొంది.

News November 15, 2025

HYD: ఈనెల 17న ‘మీ డబ్బు-మీ హక్కు’ జిల్లా స్థాయి శిబిరం: కలెక్టర్

image

‘మీ డబ్బు-మీ హక్కు’లో భాగంగా ఈనెల 17న బాగ్ లింగంపల్లిలోని TGSRTC కళ్యాణ మండపం వద్ద జిల్లా స్థాయి శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా “మీ డబ్బు- మీహక్కు” అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

News November 15, 2025

NLG: ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ సర్వీసు టీచర్లలో ఆందోళన నెలకొంది. పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల మందికి టెట్ తప్పనిసరి కావడంతో ఉపాధ్యాయ సంఘాలు మినహాయింపు కోసం ఎన్సీటీఈ, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.