News February 22, 2025
అన్నమయ్య: రైతు విభాగం అధ్యక్షుడిగా ఆరంరెడ్డి

వైసీపీ అన్నమయ్య జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా యర్రపురెడ్డి ఆరంరెడ్డి, రాజంపేట నియోజకవర్గ సోషల్ మీడియా వింగ్కు రామజయచంద్ర, మండల అధ్యక్షుడిగా ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డిని అధిష్ఠానం నియమించింది. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. సుండుపల్లెకు చెందిన ఆరంరెడ్డి, రామజయచంద్ర నియమితులవడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 6, 2025
VJA-HYD విమాన ఛార్జీల పెంపు.. కారణమిదే.!

ఇండిగో సహా పలు సర్వీసులు రద్దు కావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఎయిర్లైన్స్ ఆన్లైన్లో టికెట్ ధరలు ఏకంగా రూ. 17 వేల నుంచి రూ. 60 వేల వరకు చూపిస్తున్నాయి. ఈ అధిక ధరలపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని టికెట్ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు.
News December 6, 2025
శభాష్.. తల్లికి పునర్జన్మనిచ్చాడు

AP: విద్యుత్ షాక్తో కొట్టుమిట్టాడుతున్న తల్లి ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడుకున్నాడో ఐదో తరగతి బాలుడు. ఈ ఘటన ప.గో(D) జొన్నలగరువులో జరిగింది. నిన్న మెగా PTMకు వస్తానన్న తల్లి ఎంతకీ రాకపోవడంతో కొడుకు దీక్షిత్ ఇంటికి వెళ్లగా ఆమె కరెంట్ షాక్తో విలవిల్లాడుతూ కనిపించింది. కొడుకు భయపడకుండా స్విచ్ ఆఫ్ చేసి, కరెంటు తీగను తీసేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో పిల్లాడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
News December 6, 2025
చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.


