News December 17, 2024

అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

image

రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర (21) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ.. సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్‌పై తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 7, 2025

కడప మేయర్ ఎన్నికకు ఆహ్వానం.!

image

కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి కార్పొరేటర్ ఈనెల 11 జరిగే ప్రత్యేక సమావేశానికి రావాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లేఖలు పంపించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఉదయం 11 గంటలకు నూతన మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు.

News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.