News December 17, 2024
అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర (21) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ.. సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్పై తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 22, 2025
అక్షర బాటలో బాలయపల్లె ప్రాథమిక పాఠశాల ఆయమ్మ

కాశినాయన మండలం బాలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయాగా యంబడి బాల నాగమ్మ చాలా కాలంగా పనిచేస్తోంది. చదువంటే ఆమెకు మక్కువ కానీ పరిస్థితులు అనుకూలించక నిరక్షరాస్యురాలిగానే ఉంది. పాఠశాలలో విద్యార్థులను గమనించిన ఆమె తనకు కూడా అక్షరాలు నేర్చుకోవాలని ఉందని ఉపాధ్యాయుడు ఖాసీం వల్లికి తెలిపింది. స్పందించిన ఉపాధ్యాయుడు ఆయమ్మకి ‘రోజుకో అక్షరం’ నేర్పుతున్నారు. ఆయమ్మ సంతోషం వ్యక్తం చేసింది.
News December 22, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.13540
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12457
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2080.
News December 22, 2025
పులివెందులకు రానున్న వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 23వ తేదీ నుంచి 25వ వరకు పులివెందులలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 23వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 24వ తేదీ ఇడుపులపాయకు చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు..


