News February 20, 2025
అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

తిరుపతి రూరల్ మండలం, రామానుజపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఒకరు కడప జిల్లా, బురిడపల్లి గ్రామానికి చెందిన సాహిర్ బాషా కాగా, మరో యువతి పీలేరు, రామానాయక్ తాండాకు చెందిన బుక్కే యమునాగా పోలీసులు గుర్తించారు. యమునా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం పుత్తూరుకి వెళ్లి వస్తుండగా రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Similar News
News December 7, 2025
నువ్వుల సాగుకు అనువైన రకాలు

రబీ నువ్వుల సాగుకు తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే విత్తనాల ఎంపిక ముఖ్యం. గౌరి, మాధవి, వరాహ(Y.L.M-11), గౌతమ్(Y.L.M-17), శారద(Y.L.M-66), Y.L.M-146 రకాలను ఎంపిక చేసుకోవాలి.
☛ గౌరి: పంటకాలం 90 రోజులు. దిగుబడి ఎకరాకు 250kgలు. ఇది ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా జిల్లాలకు అనువైనది. నూనె 50%గా ఉంటుంది.
☛ మాధవి: పంటకాలం 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 200kgలు. నూనె 50%. లేత గోధుమరంగు విత్తనం.
News December 7, 2025
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

టాటా, మారుతి సుజుకీ DECలో కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మారుతి Invictoపై ₹2.15 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. ₹లక్ష క్యాష్ డిస్కౌంట్, ₹1.15 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనుంది. Fronxపై ₹88వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హారియర్, సఫారీ SUVలపై ₹75 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ను టాటా అందిస్తోంది. పాత మోడల్ తీసుకుంటే ₹లక్ష దాకా రాయితీ ఇవ్వనుంది. ఇతర మోడల్స్కూ ₹25K-55K డిస్కౌంట్స్ ఇస్తోంది.
News December 7, 2025
VKB: నామినేషన్ల ఉపసంహరణ .. బుజ్జగింపుల పర్వం

వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో, పోలింగ్కు ముందే తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ప్రధాన పార్టీల నాయకుల బుజ్జగింపులు మొదలయ్యాయి. మూడో విడత ఉపసంహరణ గడువు ఈ నెల 9న ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులను విత్ డ్రా చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


