News February 20, 2025
అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

తిరుపతి రూరల్ మండలం, రామానుజపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఒకరు కడప జిల్లా, బురిడపల్లి గ్రామానికి చెందిన సాహిర్ బాషా కాగా, మరో యువతి పీలేరు, రామానాయక్ తాండాకు చెందిన బుక్కే యమునాగా పోలీసులు గుర్తించారు. యమునా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం పుత్తూరుకి వెళ్లి వస్తుండగా రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Similar News
News March 15, 2025
HYD: సైబర్ మోసం.. రూ.1.95 కోట్ల రికవరీ..!

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సైబర్ నేరగాళ్ల చేతిలో నుంచి రూ.1.95 కోట్లను రికవరీ చేసింది. HYDలోని ఓ వ్యాపారికి చెందిన ఖాతా నుంచి ఈ మొత్తాన్ని మోసగాళ్లు తరలించారు. కొత్త ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ పేమెంట్ పేరుతో నకిలీ అకౌంట్‌కు డబ్బు పంపాలని ఓ ప్రత్యేక సందేశం పంపించి కాజేశారు. దీన్ని గుర్తించిన ఆ వ్యాపారి సంబంధించిన వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రికవరీ చేశారు.
News March 15, 2025
HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
News March 15, 2025
VKB: హత్య కేసును ఛేదించిన పోలీసులు

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.