News February 21, 2025
అన్నమయ్య: ‘వ్యాపారులు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి’

బి.కొత్తకోట పట్టణం, రూరల్ పరిధిలోని వ్యాపారులందరూ విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ జీవన్ గంగానాద్ బాబు తెలిపారు. మండలంలోని వర్తకులతో సీఐ గురువారం రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మైనర్లకు బైకులు ఇవ్వరాదన్నారు.
Similar News
News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 2, 2025
ఉమ్మడి వరంగల్ అండర్-16 క్రికెట్ జట్టు ఎంపిక

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 6 జిల్లాల అండర్-16 క్రికెట్ జట్ల ఎంపిక కోసం ఈ నెల 4న వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ క్రీడా మైదానంలో ఉదయం 10 గంటలకు ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ పోటీల ద్వారా జిల్లా జట్టును ఎంపిక చేస్తారని డబ్ల్యూడీసీఏ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. క్రీడాకారులు తప్పక హాజరుకావాలని కోరారు.
News December 2, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు సినీ గ్లామర్

TG: ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. తొలి రోజు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తారు. 2వ రోజున మీడియా ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమంలో ‘పుష్ప’ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ పాల్గొంటారు. మరికొంతమంది కళాకారులు సమ్మిట్‌లో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు.


