News March 24, 2025

అన్నమయ్య: సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.

Similar News

News November 14, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకేరోజు రెండు సార్లు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ ఉదయం రూ.770 తగ్గగా తాజాగా రూ.810 దిగివచ్చింది. దీంతో రూ.1,27,040కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర ఉదయం రూ.700 తగ్గగా ఇప్పుడు రూ.750 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,16,450గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై 100 తగ్గి రూ.1,83,100కు చేరింది.

News November 14, 2025

అనకాపల్లిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

image

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో శుక్రవారం అనకాపల్లిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరమేశ్వరరావు మాట్లాడుతూ.. మరోసారి విజయం అందించిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు పాల్గొన్నారు.

News November 14, 2025

17న ఒంగోలులో కలెక్టర్ మీకోసం కార్యక్రమం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన కలెక్టర్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత సోమవారం కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.