News February 27, 2026
అన్నమయ్య : హత్య చేసింది B.tech విద్యార్థులే.!

గాలివీడులో <<19248603>>ఈ నెల 17న జరిగిన హత్య కేసులో<<>> నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరే ఈ హత్యకు కారణమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇతనితో పాటు నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన కుళాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాధరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News April 16, 2026
GNT: మాస్టర్ మైండ్స్ సత్తా.. టాప్ ఫలితాలు

జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ కళాశాల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. జూనియర్ ఇంటర్‌లో ఐదుగురు 496 మార్కులు సాధించగా, 320 మందికి పైగా 490 పైన మార్కులు సాధించడం విశేషం. సీనియర్ MEC విభాగంలో గీతిక 984 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. సంస్థ క్రమశిక్షణ, నాణ్యమైన బోధనే ఈ విజయాలకు కారణమని యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

బ్యాంకర్లకు తిరుపతి ఎస్పీ సూచనలు

సైబర్ మోసాల కట్టడి నిమిత్తం పోలీసులు, బ్యాంకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తిరుపతి SP సుబ్బరాయుడు సూచించారు. డిజిటల్ అరెస్ట్, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, OTP మోసాలపై బ్యాంకర్లకు అవగాహన కల్పించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించాలని సూచించారు. ఇంటర్నేషనల్ కాల్స్ ద్వారా జరిగే బ్యాంక్ ఫ్రాడ్‌లపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.