News February 20, 2025

అన్నమయ్య: YS జగన్‌పై కేసు.. వైసీపీ నేత ఫైర్ 

image

మిర్చి రైతుల సమస్యలపై పోతే కేసు పెడతారా? అని ఇదెక్కడి న్యాయమని వైసీపీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ సుగవాసి శ్యాంకుమార్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మంచి పద్ధతి కాదని ఖండించారు. జగన్‌పై కేసు నమోదుపై బుధవారం రాత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 23, 2025

రాష్ట్రపతి పరిధిలోకి ‘చండీగఢ్’?: స్పందించిన కేంద్రం

image

పంజాబ్, హరియాణాల సంయుక్త రాజధాని చండీగఢ్‌పై చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రపోజల్‌ను ఆప్, అకాలీదళ్, INC సహా పంజాబ్ BJP తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా ప్రస్తుతం ఉమ్మడి రాజధానిపై పంజాబ్ గవర్నర్‌కు పాలనాధికారం ఉంది.

News November 23, 2025

KMR: అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ రాకెట్ పట్టివేత

image

కామారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్‌‌ను పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,70,500 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. నేరస్తులు చట్టం ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

News November 23, 2025

నెల్లూరు నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్!

image

నెల్లూరు నగర మేయర్ స్రవంతి‌పై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో చర్చించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నిర్ణయంపై ఇరువురు నేతల అంగీకారం తెలిపారు. సోమవారం కార్పొరేటర్లందరూ కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు.