News August 23, 2024
అన్నవరంలో సత్యదేవుని సాక్షిగా ఒక్కటైన వంద జంటలు
అన్నవరం దేవస్థానంలో పెళ్లిసందడి నెలకొంది. స్వామి సన్నిధిలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ముహుర్తాల్లో దాదాపు వంద వివాహాలు జరిగాయి. సత్యగిరిపై విష్ణు సదన్, ఉచిత కల్యాణ మండపాలు, రత్నగిరిపై ఆలయ ప్రాంగణాలు, సీతారామ సత్రం, ప్రకాష్ సదన్, పాత, కొత్త సెంటినరీ కాటేజీ ప్రాంగణాల్లో వివాహాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News September 20, 2024
రాజోలులో 54 కిలోల లడ్డూ వేలం
రాజోలు మండలం కూనవరం గ్రామంలో గురువారం రాత్రి 54 కిలోల వినాయకుడి లడ్డూ వేలం వేశారు. ఇందులో భక్తులు పోటాపోటీగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ఆ లడ్డూను స్థానిక భక్తుడు పిల్లి రామకృష్ణ రూ.73 వేలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను ఊరేగింపుగా తీసుకు వెళ్లి భక్తులకు ప్రసాదంగా పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
News September 20, 2024
గోకవరం: గంజాయి రవాణా చేస్తున్న బాలికలు అరెస్ట్
గోకవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు బాలికలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై విఎన్వీ పవన్ కమార్ తెలిపారు. వారిది ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరిగా గుర్తించి, వారివద్ద నుంచి సుమారు 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న బాలికలను జువనైల్ హోంకు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. స్వాధీన పరుచుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,53,400 ఉంటుందన్నారు.
News September 19, 2024
చిరుతను పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు: భరణి
చిరుత పులిని పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తూ.గో. జిల్లా అటవీ శాఖ అధికారి భరణి గురువారం తెలిపారు. గత రాత్రి శ్రీరాంపురం, పాలమూరు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు వచ్చిన సమాచారం అవాస్తవమన్నారు. నిపుణుల బృందం పాదముద్రలు పరిశీలించగా అవి అడవి పిల్లి పాద ముద్రలుగా నిర్ధారణ జరిగిందన్నారు. ట్రాప్ కెమెరాలో అడవి పిల్లిని గుర్తించడం జరిగిందని తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు.