News February 14, 2025
అన్నవరం దేవస్థానం కాంట్రాక్టర్‌కు జరిమానా

కాకినాడకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నవరం దర్శనానికి వెళ్లారు. ఆయన సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లో ఉంచారు. దర్శనం తర్వాత ఫోను కోసం వెళ్లగా రూ.10 చెల్లించాలన్నారు. రూ.5 అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన నిలదీశారు. దీనిపై ఆయన DEC 4న వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. విచారణ చేపట్టిన కోర్టు రూ.15 వేలు ఫిర్యాదుదారునికి, రూ.5 లక్షలు దేవస్థానంకు చెల్లించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.
Similar News
News March 24, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
News March 24, 2025
ఫారంపాండ్ కుంటలకు కేరాఫ్ ఆలూరు

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫారంపాండ్ నీటి కుంటలకు కేరాఫ్ ఆలూరు. 2014 ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మండలంలోని పెద్దహోతూరు గ్రామం వద్ద పైలెట్ ప్రాజెక్టుగా వీటిని తవ్వించారు. వాటి ఉపయోగం గురించి అప్పట్లో రైతులకు అవగాహన సైతం కల్పించారు. ఈ ప్రాంతంలో నీటి కుంటలు విజయవంతమవడంతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కుంటల తవ్వకాలు చేపట్టారు. ఇక్కడి ఉపాధి సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీటిపై ట్రైనింగ్ ఇచ్చారు.
News March 24, 2025
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: DGP

AP: బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.