News March 18, 2025
అన్నవరం-బాపట్ల కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలి

అన్నవరం నుంచి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ సోమవారం పార్లమెంటులో కోరారు.రైల్వే శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్‌పై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ విషయం లేవనెత్తారు. ఏపీలో 947 కిలోమీటర్ల సుధీర తీర ప్రాంతం ఉందని, ప్రధాన పోర్టు లు ఉన్నప్పటికీ రైల్వే కారిడార్ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. తన ప్రతిపాదన పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు.
Similar News
News March 18, 2025
రైల్వే మంత్రికి మిథున్ రెడ్డి వినతులు ఇవే..!

సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్‌ను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కలిశారు. తిరుపతి- హుబ్లీ ఇంటర్ సిటీ రైలు రెడ్డిపల్లిలో ఆగేలా చూడాలని కోరారు. తిరుపతి నుంచి కడపకు ఉదయం 5:10 గంటలకు బయలుదేరే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఇకపై 6.10 గంటలకు బయలుదేరేలా చూడాలన్నారు. చెన్నై ఎగ్మోర్-ముంబై ట్రైన్‌కు కోడూరు, రాజంపేటలో, హరిప్రియ, సంపర్క్ క్రాంతికి రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని విన్నవించారు.
News March 18, 2025
డబుల్ హెల్మెట్ ఎఫెక్ట్.. విశాఖలో 39 బైకులు స్వాధీనం

బైక్‌పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరని విశాఖ ఉప రవాణా కమిషనర్ ఆర్.సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎన్ఏడీ, మద్దిలపాలెం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 39 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తామన్నారు. లైసెన్స్ సస్పెండ్ అయ్యాక వాహనం నడిపితే వాహనం స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.
News March 18, 2025
హైడ్రా పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు: రంగనాథ్

TG: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతంలోనే ప్రకటన చేశామని, ఇప్పటికే హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇలా ఎవరైనా మోసపోతే తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం లేదా స్థానిక పోలీసులనూ ఆశ్రయించవచ్చన్నారు.