News March 18, 2025

అన్నవరం: మూలవిరాట్ ఫోటో తీసిన వ్యక్తిపై కేసు నమోదు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. ఆదివారం రాత్రి ఈవో తనిఖీలు చేసినప్పుడు సత్రంలో బీర్ బాటిళ్లు దొరికాయి. కాగా 2023 సెప్టెంబర్‌లో ఓ యూట్యూబర్ మూలవిరాట్టు వీడియో తీసి అప్లోడ్ చేశాడు. వెంటనే తొలగించాలని ఆ వ్యక్తికి సూచించినా పట్టించుకోలేదు. దీంతో ఈవో వీర్ల సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 2, 2025

NRPT జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

NRPT జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. రాజకీయ పార్టీలు, యువజన, కుల సంఘాలు పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News December 2, 2025

పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు

image

రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు SMలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.