News September 1, 2024

అన్నవరం సత్యదేవుడి ప్రసాదం చరిత్రకు 133 ఏళ్లు

image

అన్నవరం సత్యదేవుడి ఆలయం 1891లో ప్రతిష్టితమైంది. అప్పటి నుంచి భక్తులకు గోధుమ రవ్వ ప్రసాదాన్నే అందిస్తున్నారు. అన్నవరం ప్రసాదం అంటే భక్తులకు ఎంత ప్రీతిపాత్రమో చెప్పనక్కర్లేదు. భారత ఆహార ప్రమాణాల సంస్థ తాజాగా FSSAI గుర్తింపునిచ్చింది. ఏటా 2కోట్లకు పైగా స్వామి ప్రసాదం ప్యాకెట్లను దేవస్థానం విక్రయిస్తోంది. ఒక్క ప్రసాదాల ద్వారా ఏటా రూ.40 కోట్ల ఆదాయం సమకూరుతోంది. కాగా ఈ ప్రసాద చరిత్రకు నేటికి 133 ఏళ్లు.

Similar News

News October 30, 2025

ధవళేశ్వరం: 94 వేల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బుధవారం సాయంత్రం 94,122 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ముందస్తు చర్యలో భాగంగా, తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.

News October 28, 2025

తుఫాన్ చర్యలపై రాజమండ్రి MP ఆరా

image

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

News October 28, 2025

తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

image

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.