News May 19, 2024
అన్నవరం సత్యదేవుని కళ్యాణం.. నేటి కార్యక్రమాలు

అన్నవరం సత్యదేవుడి కళ్యాణోత్సవాల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణ ధారణ, దీక్షా వస్త్రధారణ జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి మంగళ సూత్రాలు, చుట్లు, స్వామికి స్వర్ణ యజ్ఞోపవేతాలను మేళతాళాల మధ్య గ్రామంలో విశ్వబ్రాహ్మణుల నుంచి తీసుకు వస్తారు. రాత్రి 7 గంటలకు స్వామిని వెండి గరుడ వాహనంపై, అమ్మవారిని గజవాహనంపై, పెళ్లి పెద్దలైన సీతారాములను వెండి పల్లకీలో ఊరేగిస్తారు.
Similar News
News December 4, 2025
కోరుకొండలో గంజాయి ముఠా గుట్టురట్టు

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను కోరుకొండ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురం-కనుపూరు రోడ్డులో గంజాయి చేతులు మారుతుండగా దాడి చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడిన ఆరుగురిని అరెస్టు చేశారు. స్విఫ్ట్ కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
News December 4, 2025
ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ఇన్‌స్ట్రక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, సీతానగరం, రాజానగరం, కడియం పరిధిలోని పాఠశాలల్లో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
News December 4, 2025
రాజమండ్రి: నిర్మలా సీతారామన్‌కు MP పురంధేశ్వరి రిక్వెస్ట్!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం భేటీ అయ్యారు. పొగాకు బోర్డులో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, పొగాకుపై GST, పంటకు సంబంధించిన పలు విషయాలను ఆమె వివరించారు. టొబాకో బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ కూడా పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారానికి హామీ ఇచ్చారని పురంధేశ్వరి పేర్కొన్నారు.


