News September 15, 2024
అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి
నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయపాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, డి.ఈలు విజయ్ కుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తరితరులు పాల్గొన్నారు.
Similar News
News October 3, 2024
రేపే తిరుపతిలో ఉద్యోగ మేళా
తిరుపతిలోని పద్మావతిపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 3, 2024
కుప్పంలో గ్రానైట్ అక్రమ రవాణా..?
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గ్రానైట్ అక్రమ రవాణా జోరుగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. కుప్పం నుంచి గ్రామీణ రహదారుల్లో వ్యాపారులు నిత్యం తమిళనాడుకు అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా గ్రానైట్ లారీలు సరిహద్దులు దాటుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కుప్పం(M) పైపాళ్యం మీదుగా తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీని పై ఫొటోలో చూడవచ్చు.
News October 3, 2024
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: డీఈవో
తిరుపతి జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో శేఖర్ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.