News July 25, 2024
అన్నా క్యాంటీన్లు సిద్ధం చేయాలి: సూర్య తేజ

నగర పాలక సంస్థ పరిధిలోని అన్నా కాంటీన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి రానున్న ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి తేవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. గతంలో ఎంపిక చేసిన అన్నా కాంటీన్ల ప్రాంగణాలను పరిశుభ్రం చేసి, కాంటీన్ నిర్వహణకు సిద్ధం చేయాలన్నారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు: ZPలో పోస్టులు ఖాళీ.. పాలన అధోగతీ.!

ZP(జిల్లాపరిషత్) అంటే అన్నీ శాఖలకు పెద్దన్నలాంటిది. ఇందులో CEO నుంచి స్వీపర్ వరకు 1,247 పోస్టులు ఉండాలి. వీటిలో 929పోస్టులు మాత్రమే భర్తీ కాగా 338 ఖాళీగా ఉన్నాయి. ప్రధానమైన MPDO పోస్టులు 46 ఉండాల్సి ఉండగా 16 చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు-133, వాచ్మెన్లు-98, వాటర్ మెన్లు-39 వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే తప్ప పాలన గాడిలో పడదని పలువురు అభిప్రాయడుతున్నారు.
News November 23, 2025
నెల్లూరు: కరెంట్ సమస్యలా.. ఈ నం.కు కాల్ చేయండి.!

నెల్లూరు జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ APPSDCL కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ MD శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10-12 గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రజలు తమ విద్యుత్ సమస్యలపై 8977716661కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.
News November 23, 2025
నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చిన వారు అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోడానికి కాల్ సెంటర్ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇచ్చిన అర్జీకి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gp.inలో సైతం ఇవ్వొచ్చని కలెక్టర్ తెలిపారు.


