News February 18, 2025

అన్ని ఏర్పాట్లు చేయాలి: నిర్మల్ కలెక్టర్

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. దివ్యాంగ ఓటర్లకు ఇబ్బందులు రాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్, ర్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News December 7, 2025

రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

image

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్‌లైన్‌లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News December 7, 2025

కడియంలో “జనసేన”కేదీ ప్రాధాన్యత..?

image

కడియం మండలంలో జనసేనకి ప్రాధాన్యం తగ్గుతుందని ఆ పార్టీ శ్రేణులు అంతర్మధనంలో ఉన్నాయి. గతంలో మెజారిటీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానం గెలిచినా ఎంపీపీ పదవిని టీడీపీకి త్యాగం చేశారు. తాజాగా సొసైటీ ఛైర్మన్ల నియామకంలోనూ టీడీపీ మూడు దక్కించుకోగా, జనసేనకు ఒక్కటే దక్కింది. ఇప్పటికే రెండు పదవులున్న ఎంపీపీ బంధువుకే మళ్లీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు లోకల్‌గా టాక్ నడుస్తోంది.

News December 7, 2025

కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

image

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.