News February 18, 2025

అన్ని ఏర్పాట్లు చేయాలి: నిర్మల్ కలెక్టర్

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. దివ్యాంగ ఓటర్లకు ఇబ్బందులు రాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్, ర్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

రామన్నపేట: మార్చి 28 జాతీయ లోక్ అదాలత్

image

మారుమూల ప్రజలకు న్యాయం అందేలా వివిధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన జడ్జి A.జయరాజు రామన్నపేట కోర్టులో మార్చి 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు పరిష్కరించే విధానాలపై DLSA కార్యదర్శి V.మాధవిలత, రామన్నపేట Sr సివిల్ జడ్జి G.సబిత, ప్రిన్సిపల్ Jr సివిల్ జడ్జి S.శిరీష, 2nd క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి D.సత్తయ్యతో కలిసి చర్చించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 14, 2026

పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.

News March 14, 2026

GNT: జాతీయ లోక్ అదాలత్.. 24,756 కేసులు క్లియర్

image

గుంటూరు కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 24,756 కేసులు పరిష్కరించబడినట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ నాగరాజా తెలిపారు. 1,694 సివిల్ కేసులు, 22,983 క్రిమినల్ కేసులు, 79 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద భీమా, చెక్ బౌన్స్ కేసుల్లో పరిష్కరమైన కేసుల మొత్తం విలువ సుమారు రూ.42.58 కోట్లుగా ఉందన్నారు.