News August 29, 2024

అన్ని పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలి: కలెక్టర్ టీఎస్ చేతన్

image

సత్యసాయి జిల్లాలోని అన్ని పరిశ్రమలలో ప్రమాదాల నివారణపై అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల నిర్వహణ, ప్రమాదాల నియంత్రణపై అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

Similar News

News January 22, 2025

మడకశిరలో ₹2400 కోట్ల పెట్టుబడి!

image

భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.కళ్యాణిని దావోస్‌లోమంత్రి నారా లోకేశ్ కలిశారు. రక్షణ తయారీ ప్రాజెక్టు గురించి చర్చించారు. మడకశిర నియోజకవర్గం ముర్దనహళ్లిలో 1000 ఎకరాల్లో ₹2400 కోట్లతో రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కళ్యాణి తెలిపారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని మంత్రి లోకేశ్ ఆయనను కోరారు.

News January 22, 2025

రుణ పరిమితిపై నిర్ణయం: అనంతపురం కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హల్‌లో మంగళవారం డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా పలు పంటలకు మంజూరు చేసే రుణ పరిమితిని ఖరీఫ్-2025, రబీ 2025-26 సంవత్సరాలకు నిర్ణయించామన్నారు. ఈ పరిమితిని రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం కోసం పంపినట్లు వివరించారు.

News January 21, 2025

కడప SPగా నార్పల గ్రామ వాసి

image

కడప జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పల గ్రామం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 2010లో డీఎస్పీగా విధుల్లో చేరారు. నాగర్ కర్నూల్, చింతలపల్లె, కడపలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2018లో ఏఎస్పీగా ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమోషన్‌పై ఇటీవల ఎస్పీగా పదోన్నతి రావడంతో మొదటి పోస్టింగ్ కడపకు ఇచ్చారు.