News August 29, 2024

అన్ని పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలి: కలెక్టర్ టీఎస్ చేతన్

image

సత్యసాయి జిల్లాలోని అన్ని పరిశ్రమలలో ప్రమాదాల నివారణపై అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల నిర్వహణ, ప్రమాదాల నియంత్రణపై అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

Similar News

News September 15, 2024

వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలను, సలహాలను అధికారులకు తెలియజేశారు. జిల్లాలో ఉన్న ప్రతి స్కానింగ్ సెంటర్ ఆక్ట్ ప్రకారం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News September 15, 2024

పోలీస్ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్పీ రత్న

image

శ్రీ సత్యసాయి జిల్లా వినాయక శోభాయాత్ర నిమజ్జనం కార్యక్రమాలు విజయవంతం చేయడంపట్ల ఎస్పీ పోలీస్ సిబ్బందిపై శనివారం ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చక్కగా విధులు నిర్వర్తించారన్నారు. కదిరి ధర్మవరం హిందూపురంలోని ప్రధాన పట్టణాల్లో సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నిబద్ధతతో పని చేశారన్నారు. కావున జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News September 15, 2024

హిందూపురం: రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి

image

హిందూపురం మండలం బీరేపల్లి సమీపంలోని కేమల్ పరిశ్రమ గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ మాజీ జవాన్ అచ్చప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. హిందూపురం నుంచి గోరంట్ల వైపు వెళుతున్న కారు వెళ్తుండగా గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంలో అచ్చప్ప హిందూపురం వస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో అచ్చప్ప అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.