News June 14, 2024
అన్ని లెక్కలు బయటకు తీస్తాం.. పేదలకు న్యాయం చేస్తాం: పరిటాల సునీత
గత ఐదేళ్లలో పేదల ఇళ్ల మాటున కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చేసిన అవినీతి లెక్కలను బయటకు తీస్తామని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశమై నియోజకవర్గంలో నిధులు ఉండి పనులు చేయని రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News September 10, 2024
అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు
అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
News September 10, 2024
తాడిపత్రిలో అగ్నిప్రమాదం
తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2024
అనంతపురంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ
అనంతపురంలో ఈ నెల 11న జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఉరేగింపు ప్రారంభం కావాలని తెలిపారు. 10 అడుగుల కంటే ఎత్తయిన విగ్రహాలను పంపనూరు కెనాల్లో, 10 అడుగులకు తక్కువ విగ్రహాలను రాచన పల్లి వంకల్లో నిమజ్జనం చేయాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.