News December 23, 2024

అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

image

అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ లో సర్వ శిక్షా ఉద్యోగుల నిరసనకు హరీష్ రావు మద్దతు పలికి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీసినా స్పందించలేదని పండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ప్రజల సమస్యలు ముఖ్యం కావా అని ప్రశ్నించారు. ఇకనైనా సమగ్ర ఉద్యోగుల సమస్య పరిష్కరించాలన్నారు.

Similar News

News January 25, 2025

మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఈ- ఆఫీస్ అమలు: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ- ఆఫీస్ కార్యక్రమానికి శ్రీకారం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు పేపర్‌పై పని తగ్గించాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా తయారు చేసేందుకు కృషి చేయాలన్నారు. సంబంధిత కార్యాలయాల్లో విద్యుత్‌ను ఆదా చేసి ఈ- ఆఫీస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News January 24, 2025

మెదక్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడానికి ఇవాళ వరకు జాబితా ఇవ్వాలని సూచించారు.

News January 24, 2025

ప్రారంభమైన చిత్తారమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

image

రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు గణపతి పూజ, అమ్మవారికి ఘటాభిషేకం, కంకణ ధారణ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, నిత్యబలిహారం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.