News April 18, 2024

అన్ని వర్గాల అభ్యున్నతికి మోదీ కృషి: డీకే అరుణ

image

దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రధాని మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. నామినేషన్ల దాఖలు చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలు చేయని కాంగ్రెస్ నాయకులు కోతలు కోస్తున్నారని విమర్శించారు. రైల్వే మార్గాలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామంటున్న CM రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు రాకుండా ఎలా ఏర్పాటు చేస్తావని ప్రశ్నించారు.

Similar News

News September 10, 2024

MBNR: మరణంలోనూ వీడని స్నేహం

image

షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

News September 10, 2024

MBNR: భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

పాలమూరు జిల్లాలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో‌ మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT

News September 10, 2024

చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం

image

మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి సోమవారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. NGKL జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.