News March 17, 2025
అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు: మంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. దేవాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆయన తనకు ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా అందజేశారని సభలో వెల్లడించారు.
Similar News
News March 18, 2025
నెల్లూరు యువకుడిపై బీరు బాటిళ్లతో దాడి

నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు సమీపంలో ఓ యువకుడిపై ఇద్దరు యువకులు విచక్షణారహితంగా బీరు బాటిళ్లతో దాడి చేశారు. డైకస్ రోడ్డులో వెళ్తున్న వెంగళరావు నగర్కు చెందిన షారుక్ను ఆటోలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులు అడ్డగించి పలకరించలేదని దౌర్జన్యంతో బీరు బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన షారుక్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 18, 2025
రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.
News March 18, 2025
కామారెడ్డి జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ

KMR జిల్లాలో MROలు బదిలీ అయ్యారు. సురేశ్ బిచ్కుంద నుంచి రాజంపేట, రేణుక చౌహన్ డోంగ్లి నుంచి లింగంపేట, హిమబిందు జుక్కల్ నుంచి పల్వంచకు, వేణుగోపాల్ పిట్లం నుంచి బిచ్కుంద, మహేందర్ ఎల్లారెడ్డి నుంచి జుక్కల్ బదిలీ అయ్యారు. నరేందర్ గౌడ్ లింగంపేట్ నుంచి డోంగ్లి, సతీష్ రెడ్డి గాంధారి నుంచి మాచారెడ్డి, అనిల్ కుమార్ రాజంపేట నుంచి పిట్లం, సువర్ణ రామారెడ్డి నుంచి DAO సబ్ కలెక్టర్ బాన్సువాడకు నియమించారు.