News March 23, 2025

అన్న కోసం ఎదురు చూసి అనంతలోకాలకు

image

అన్న కోసం ఎదురు చూసిన చిన్నారి అనంతలోకాలకు వెళ్లిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. నగరి మండలం వీకేఆర్ పురం గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగనన్న కాలనీలో ఉంటున్న నోమేశ్వరి(10) మృతి చెందగా, ఆమె సోదరుడు మహేశ్ గాయపడిన విషయం తెలిసిందే. ఒంటిపూట బడి కావడంతో అన్న కోసం ఎదురు చూసిన నోమేశ్వరి.. మహేశ్ రాగానే ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.

Similar News

News November 25, 2025

అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

image

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.