News March 19, 2025

అన్న క్యాంటీన్‌ను పర్యవేక్షించిన కలెక్టర్

image

నిరుపేదల ఆకలి తీర్చి పేద ప్రజలకు అండగా వుండే అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ పర్యవేక్షించారు. మంగళవారం నంద్యాలలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సముదాయంలో నున్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా పరిశీలించారు. క్యాంటీన్లలో రోజువారీగా నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను ఇవ్వాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

Similar News

News April 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 24, 2025

KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి

image

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ జి.ఫనింద్రరెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించి PACS, ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వసతులపై ఆరా తీశారు. తక్షణ ట్యాబు ఎంట్రీ, 72 గంటల్లో చెల్లింపు, తేమ శాతం, FAQ నిబంధనల ప్రకారం కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News April 24, 2025

అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: MLC కవిత

image

గోదావరిఖనిలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవ వేడుకలు బుధవారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా MLC కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ‘శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని’ ఆమె ఆకాంక్షించారు.

error: Content is protected !!