News August 15, 2024

అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

image

గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ భోజనం చేస్తున్న వారితో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం వారికి మంచి భవిష్యత్తు చూపించాలని కలెక్టర్ డీకే బాలాజీని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

EVM గోడౌన్‌ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

EVM గోడౌన్ వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

News November 17, 2025

కృష్ణా: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అల్పపీడనం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. జిల్లాలో వరి కోతలను రైతులు ముమ్మరం చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది వరి కోత మిషన్ల ధరలను విపరీతంగా పెంచేశారు. గంటకు రూ.3 వేలుకు గాను రూ. 4వేలు వరకు డిమాండ్ చేస్తుండటం రైతులకు భారంగా మారింది.