News August 15, 2024
అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ భోజనం చేస్తున్న వారితో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం వారికి మంచి భవిష్యత్తు చూపించాలని కలెక్టర్ డీకే బాలాజీని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 20, 2024
కృష్ణా: ANU డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y23 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News September 20, 2024
కృష్ణా: రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల జరిగిన బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు 2వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News September 20, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
విజయవాడ, గుడివాడ మీదుగా తిరుపతి(TPTY)- బిలాస్‌పూర్ (BSP) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్‌లకు కొవ్వూరులో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొవ్వూరులో ఇచ్చిన స్టాప్‌ను ఈ నెల 21 నుంచి పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17481 BSP-TPTY రైలు ఈ నెల 21 నుంచి, నం.17482 TPTY-BSP రైలు ఈ నెల 22 నుంచి కొవ్వూరులో ఆగుతుందన్నారు.