News August 6, 2024
అన్బురాజన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు
అనంతపురం జిల్లా మునుపటి ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ శివరాముడుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. వారు కులం పేరుతో దూషించారని లత్తవరం గ్రామానికి చెందిన సాకే రోజా అనే మహిళ ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. న్యాయవాది శివప్రసాద్ తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు.
Similar News
News September 13, 2024
అనంత: నూరుల్లా దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం
తాడిపత్రిలో గురువారం రాత్రి నూరుల్లా(34) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వివరాలను సీఐ సాయిప్రసాద్ వెళ్లడించారు. ‘నూరుల్లా ఆర్జాస్ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగం చేసేవారు. కొన్నేళ్ల నుంచి చిన్న బజార్‌కు చెందిన మహిళతో సన్నిహితంగా ఉన్నారు. నిన్న రాత్రి విధులు ముగించుకొని సదరు మహిళ ఇంటి వద్దకు వెళ్లడం ఆమె బంధువులు చూశారు. ఆవేశంతో బండరాళ్లతో కొట్టి హత్య చేశారు’ అని తెలిపారు.
News September 13, 2024
శ్రీ సత్యసాయి: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం వైపు నుంచి కదిరి వైపునకు బైక్‌పై వెళ్తుండగా పక్కనున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 13, 2024
ఈ పంట నమోదులో అధికారులకు నిర్లక్ష్యం తగదు: కలెక్టర్
అనంత: ఖరీఫ్లో చేపడుతున్న ఈ పంట నమోదులో వ్యవసాయ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంతో వ్యవహరించి రాదనీ, ఈ నెల 15 నాటికీ వంద శాతం పంట నమోదు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్దేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పంట నమోదులో భాగంగా బ్రహ్మసముద్రం, నార్పల, హీరేహాళ్ మండలాలు వెనుకబడ్డాయని, కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వజ్రకరూరులో మాత్రమే 100 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.