News September 1, 2024

అపరాధ రుసుము లేకుండా ఫీజులు చెల్లింపునకు అవకాశం

image

అకడమిక్ ఇయర్ కోర్సుల్లో చేరే విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి అపరాధ రుసుము చెల్లించకుండా ఫీజులు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు ఏయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ మోహన్ తెలిపారు. నవంబరు 15 వరకు ఫీజులు చెల్లించేందుకు గడువు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News January 22, 2025

ఉమ్మడి విశాఖలో 29 మద్యం షాపులు కేటాయింపు

image

రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 28 మద్యం దుకాణాలను కేటాయించింది. అనకాపల్లి జిల్లాలో గౌడ శెట్టిబలిజ యాత కులస్తులకు మొత్తం 15 దుకాణాలను కేటాయించింది. విశాఖ జిల్లాలో 14 దుకాణాలను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక్క దుకాణం కూడా కేటాయించలేదు.

News January 22, 2025

భీమిలిలో దివ్యాంగ బాలికపై అత్యాచారం

image

భీమిలి పట్టణంలో మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మానసికస్థితి సరిగా లేకపోవడంతో పాటు పోలియోతో బాలిక మంచం పైనే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం నిందితుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక నానమ్మ బయటికి వెళ్లి వచ్చి చూసేసరికి నిందితుడు లోపల ఉండటంతో కేకలు వేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 22, 2025

విశాఖ: ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ.2 కోట్లు

image

సంక్రాంతి సీజన్‌లో విశాఖ ఆర్టీసీకి రూ. రెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35% అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. సంక్రాంతికి ముందు తర్వాత ఈనెల 21 వరకు విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాలకు బస్సులు నడిపినట్లు తెలిపారు. ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదన్నారు.