News December 11, 2024

అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దు: ఎస్పీ

image

అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్​ లిఫ్ట్ చేస్తే వారు మీ కాల్‌ను రికార్డు చేసి పోలీసు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తారన్నారు. వేధింపులకు గురిచేసి మీ డబ్బులు దోచేస్తారని, అటువంటి సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని ప్రజలను సూచించారు. సైబర్ నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News January 23, 2025

నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి

image

నంద్యాల రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు నంద్యాల రైల్వే ఎస్సై అబ్దుల్ జలీల్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఫ్లాట్‌ఫామ్ నంబర్‌2 వద్ద వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు కాషాయపు వస్త్రాలు ధరించాడని, సుమారు 60 ఏళ్లు ఉంటాయన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

News January 23, 2025

12వ రోజు 286 మంది అభ్యర్థుల ఎంపిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 12వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 286 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.

News January 23, 2025

జాతీయ స్థాయి బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఆత్మకూరు క్రీడాకారులు

image

భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 31 వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే 38వ జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఆత్మకూరుకు చెందిన క్రీడాకారులు శివకుమార్, రియాజ్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా సంఘం కార్యదర్శి రుద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను టీ&టీ అధినేత జబీర్ హుస్సేన్ ప్రత్యేకంగా అభినందించి నగదు ప్రోత్సాహాన్ని అందించారు.