News April 11, 2025
అపార్ట్ కార్డుల నమోదులో మొదటి స్థానంలో జగిత్యాల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే అపార్ కార్డుల నమోదులో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 1096 పాఠశాలలు ఉండగా.. 1,61,822 మంది విద్యార్థులు ఉన్నారు. అపార్ కార్డుల నమోదులో 88.73 శాతం చేసి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచేందుకు కృషిచేసిన జిల్లా విద్యాధికారి రామును ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఏర్పడతాయంటే?

ఫైబ్రాయిడ్లు ఎందుకు ఏర్పడతాయన్న విషయంలో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, శరీరంలో జరిగే కొన్ని మార్పులు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత తలెత్తినప్పుడు ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయి. వంశపారంపర్యంగా కూడా ఫైబ్రాయిడ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పోషకాహార లోపం, చిన్న వయసులోనే రజస్వల అవడం, ఒత్తిడి దీనికి కారణాలంటున్నారు నిపుణులు.
News December 8, 2025
కడప: కరెంట్ సమస్యలు ఉన్నాయా.. ఈ నంబర్కు కాల్ చేయండి.!

కడప జిల్లాలో విద్యుత్ సమస్యలపై ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 వరకు డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ MD శివశంకర్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ప్రజలు 89777-16661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా వాసులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
News December 8, 2025
కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు.. అల్లూరిలో 5.3 డిగ్రీలు నమోదు

ఏపీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అల్లూరి జిల్లాలోని జి.మాడుగుల మండలంలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంచంగిపట్టులో 7.7, డుంబ్రిగూడలో 8.2, అరకులో 8.9, చింతపల్లి 9.5, హుకుంపేటలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అటు తెలంగాణ HYDలోని HCUలో 9 డిగ్రీలు, BHELలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు పేర్కొన్నారు.


